చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సీఐ క్యాస్ట్రోని లింగంపల్లి గ్రామ కమిటీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లింగంపల్లి గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మత్తులు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ ముదిరాజ్, ప్రతినిధులు ఎల్లేష్, సోమయ్య యాదవ్, లింగంశీను, కృష్ణ, విష్ణు, ప్రణయ్, యాదయ్య పాల్గొన్నారు.

