మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు గురువారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు కార్పొరేటర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందుకు కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు.






