మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి: కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామ‌ని కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో స్థానిక నాయకులు, బస్తీ అధ్యక్షులు, వార్డ్ సభ్యులు అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయ‌న‌ పాదయాత్ర నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించే విధంగా చేపట్టిన నూతన పైప్ లైన్ నిర్మాణ పనులను, పూర్తయిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నూతనంగా చేపట్టాల్సిన పనులను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ తెలిపారు.

ఆదిత్య న‌గ‌ర్ బ‌స్తీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఆదిత్య నగర్ బస్తీలో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. మంజూరైన పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా అధికారులతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.

అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ ప్రశాంత్, ఆదిత్య నగర్ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ఖాసీం, సుభాష్ చంద్రబోస్ నగర్ టిఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు ముఖ్తర్, వార్డ్ సభ్యుడు రహీం, టిఆర్ఎస్ మైనారిటీ నాయకులు బాబూమియా, సలీం, బస్తీ నాయకులు లియాకత్, మియాన్, సత్యనారాయణ, రామకృష్ణ, నర్సింగ్ రావు, ఆదిత్య నగర్ యూత్ అధ్యక్షుడు ఖాజా, యూత్ సభ్యులు ఎండి మహమ్మద్, ఎం.బాషరత్, ఎండి నవీద్, ఎండి షైక్ ఇమ్రాన్, అక్బర్, ఉమాదేవి, పర్వీన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here