మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్‌లో స్వరమహతి సంగీతాలయ్‌ విద్యార్థుల‌ సత్తా

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హిందూస్థాన్‌ ఆర్ట్‌ అండ్‌ మ్యూజిక్‌ సొసైటీ డిసెంబర్‌ 18 నుంచి 30వ తేదీ వరకు కోల్‌కతాలో నిర్వహించిన భారత్‌ సంస్కృత ఉత్సవ్‌ ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌లో బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురంకు చెందిన స్వరమహతి సంగీతాలయ్‌ విద్యార్థులు సత్తా చాటారు. పలు విభాగాల్లో వారు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌లో స‌త్తా చాటిన విద్యార్థుల‌ను అభినందించిన ఆదిత్య కిరణ్

వోకల్‌ క్లాసిక్‌లో సబ్‌ జూనియర్‌ విభాగంలో ఆరాధ్య అరోహికి చైర్మన్‌ అవార్డు లభించగా, బొడ్డ ధన్వితకు 2వ బహుమతి, రాశి గుప్తాకు ప్రెసిడెంట్‌ అవార్డులు లభించాయి. అదేవిధంగా జూనియర్‌ విభాగంలో ముగ్ధ అభిజిత్‌ కులకర్ణికి ఛైర్మన్‌ 3వ బహుమతి రాగా, భాగవతుల శ్రీవల్లి, సమర్పిత ఆచార్యలకు చైర్మన్‌ అవార్డులు, పెంటకోట వైశాలికి అధ్యక్షుడు అవార్డు, గాయత్రి రెడ్డి.ఎస్‌, ఎస్‌.వైభవి మల్హర్‌లకు ప్రెసిడెంట్‌ అవార్డులు వచ్చాయి. అలాగే సీనియర్‌ విభాగంలో దేవులపల్లి మనస్విని, జి.లాస్య ప్రియలకు 3వ బహుమతులు వచ్చాయి.

భజన్‌లో సబ్‌ జూనియర్‌ విభాగంలో రాశి గుప్తాకు 2వ బహుమతి, రిథం బాలికి చైర్మన్‌ అవార్డులు వచ్చాయి. జూనియర్‌ విభాగంలో సమర్పిత ఆచార్యకు3వ బహుమతి, అనన్య శ్రీవాస్తవకు ఛైర్మన్‌ అవార్డు, భాగవతుల శ్రీవల్లి, ఎస్‌.వైభవి మల్హర్‌లకు ప్రెసిడెంట్‌ అవార్డులు వచ్చాయి.

సెమి క్లాసికల్‌ సాంగ్‌లో సీనియర్‌ విభాగంలో హార్దిక్‌ ఓం సాయి బాతులకు చైర్మన్‌ అవార్డు, జానపద పాటలో సీనియర్‌ విభాగంలో భాగవతుల శ్రీవల్లికి ప్రెసిడెంట్‌ అవార్డు, కూచిపూడి నృత్యంలో జూనియర్‌ విభాగంలో వేదికా జిగ్నేష్‌ సోనేజీకి 2వ బహుమతి వచ్చాయి. అలాగే తబలాలో సబ్‌ జూనియర్‌ విభాగంలో ఎం.అర్జున్‌కు ప్రెసిడెంట్‌ అవార్డు, ఎస్‌.అనీష్‌ మల్హర్‌కు చైర్మన్‌ అవార్డు, జూనియర్‌ విభాగంలో దేవులపల్లి మానస్‌, కోటా సాకేత్‌ కుమార్‌, స్వాజిత్‌ సీహెచ్‌లకు ప్రెసిడెంట్‌ అవార్డులు, సీనియర్‌ విభాగంలో కె.జయంత్‌ దత్తకు ప్రెసిడెంట్‌ అవార్డు లభించాయి.

ఈ సందర్భంగా స్వరమహతి సంగీతాలయ్‌ హైదరాబాద్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ డైరెక్టర్‌ బి.ఆదిత్య కిరణ్‌ విద్యార్థులను ప్రశంసించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here