- కేక్ కటి పండ్లు, భోజనం పంపిణీ చేసిన రవికుమార్ యాదవ్
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ జన్మదినం సందర్బంగా బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, కొంచ శివరాజ్ ముదిరాజ్, జాజి రావు రాము, కొంచ బాబు ముదిరాజ్ ల ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ లోని అనాథాశ్రమంలో వృద్ధులు, చిన్నారులకు ఆ పార్టీ నాయకుడు రవికుమార్ యాదవ్, మియాపూర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్ర రావులు బుధవారం పండ్లను పంపిణీ చేశారు. అనంతరం భోజన ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ భిక్షపతి యాదవ్ జన్మదినం సందర్భంగా అనాథ పిల్లలకు, వృద్ధులకు ఇలా సహాయం చేయడంతో ఎంతో సంతోషాన్నిస్తుందని అన్నారు. పేదలకు సేవ చేసేందుకు తన తండ్రి భిక్షపతియాదవ్, తాను ఎల్లప్పుడూ ముందే ఉంటామన్నారు. ఇప్పటికే పేదల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో చిన్నారులకు ఏటా పుస్తకాలను, విద్యాసామగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, అలాగే పేదల కోసం ఉచిత కంటి వైద్యశాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నామని తెలిపారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు ఎల్లప్పుడూ సహాయ కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల నడుమ భిక్షపతియాదవ్ జన్మదిన కేక్‌ను రవికుమార్ యాదవ్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శివ, శ్రీధర్, వినోద్ యాదవ్, రామాచారి, నరేష్, చారి, రమేష్ పాల్గొన్నారు.






