శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీ నగర్, నెహ్రూ నగర్ లలో బుధవారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేపట్టారు. బస్తీల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఆయనకు విన్నవించారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి వారితో సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రజల అభిప్రాయం మేరకు నెహ్రూ నగర్లో నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపీ నగర్, నెహ్రూ నగర్ లలో అన్ని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారం దిశగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నెహ్రూ నగర్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈ శ్రీనివాస్, శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ గౌరవాధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు యాదా గౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, గఫూర్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గోపీ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నెహ్రూ నగర్ యూత్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీకాంత్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, మహేందర్ సింగ్, దినేష్ సింగ్ పాల్గొన్నారు.






