నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపి అనుముల రేవంత్ నియమితులైన సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు. 124 డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలకు ముఖ్యతిథిగా యూత్‌కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ టిపిసిసి సారధిగా రేవంత్ రెడ్డి ని నియమించడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఈ కార్య్రక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హరిగౌడ్, జావీద్, మోసిన్, సయ్యద్, కార్తిక్, స్యామ్యూల్, దుర్గాదాస్, రూబెన్, మహిళా కాంగ్రెస్ నాయకులు అరుణ, ఫాతిమ తదితరులు పాల్గొన్నారు.
