పిసిసి చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామ‌కంపై శేరిలింగంప‌ల్లిలో హ‌ర్షాతిరేకాలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని నియ‌మిస్తూ ఏఐసిసి తీసుకున్న నిర్ణ‌యంపై శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డి నియామ‌కాన్ని స్వాగ‌తిస్తూ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ర‌ఘునంద‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో చందాన‌గ‌ర్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంబురాలు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘునంద‌న్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా నియ‌మితులైన అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి, పిసిసి కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభవం వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ మారెళ్ళ శీనివాస్, నగేష్ నాయక్, వి.యాదగిరి, డీసీసీ ప్రధాన కార్యదర్సి మామిడి సందీప్ రెడ్డి, మైనార్టీ వైస్ చైర్మన్ అయాజ్ ఖాన్, హబీబ్, సురేష్ నాయక్, రాజన్, చిరంజీవి, దుర్గాదాస్, అరుణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

చంద‌నగ‌ర్ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద సంబ‌రాలు జ‌రుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here