శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రంగరెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులు గా నియమితులైన సామారంగారెడ్డిని గురువారం శేరిలింగంపల్లి బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి జిల్లా నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్, తోపు గొండ మహిపాల్ రెడ్డి, మక్తాల స్వామీ గౌడ్ లు సామ రంగారెడ్డి ని ఘనంగా సన్మానించారు. శేరిలింగంపల్లి లో పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ గౌడ్, చందు యాదవ్, చంద్రశేఖర్ శాస్త్రి, సాయిరాం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.