నిరంతర అధ్యయన శీలి ధీన్ దయాల్ ఉపాద్యాయ: నందకుమార్ యాదవ్

దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నంద కుమార్ యాదవ్, చింతకింది గోవర్ధన్ గౌడ్, మహిపాల్ రెడ్డి

శేరిలింగంపల్లి (నమస్తే తెలంగాణ): పండిత్ ధీన్ దయాల్ ఉపాద్యాయ నిరంతర అధ్యయన శీలి, కర్మ యోగి అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ నందకుమార్ యాదవ్ కొనియాడారు. బిజెపి సీనియర్ నాయకులు చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద జన సంఘ్ వ్యవస్థాపకులు, బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన నంద కుమార్ యాదవ్ మాట్లాడుతూ నాటి జనసంఘ్ అయినా నేటి బీజేపీ అయినా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీని అందించిన ఘనత దీన్ దయాల్ కి దక్కుతుందని అన్నారు. పాశ్చాత్యులు తెరపైకి తెచ్చిన పెట్టుబడిదారి విధానం, కమ్యూనిస్టులు సూచించుట సామ్యవాదం సిద్దాంతాలకు భిన్నంగా భారతీయమైన ఏకాత్మ మానవ దర్శనం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, యువమోర్చ నాయకుడు సాయిరాం గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఖాజాగూడలో

దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న బిజెపి నాయకులు వసంత్ కుమార్ యాదవ్, నరేందర్ ముదిరాజ్, స్వామి గౌడ్ లు

బీజేపీ గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో జన సంఘ్ వ్యవస్థాపకులు బీజేపీ సిద్ధాంతకర్త  దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని ఖాజాగూడ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వసంత్ కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ ముదిరాజ్, స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, మహేందర్ చెట్టి, అంబటి అశోక్ కుమార్, నీలం సురేందర్, అనిల్ గౌడ్,సతీష్ గౌడ్, బీజేవైఎం శివ కుమార్, విష్ణు,R.వెంకటేష్,  రాఘవేంద్ర, తిరుపతి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here