రాజకీయ నాయకులు ఎక్కువగా తెలుపు దుస్తులు ధరిస్తారు ఎందుకో తెలుసా…?

భారత దేశంలో రాజకీయ నాయకులు ఎక్కువగా తెలుపు రంగు ఖద్దరు/ఖాదీ దుస్తులే ధరిస్తారు. మరి ఎందుకు తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇస్తారో ఎప్పుడైనా ఆలోచించారా…? రాజకీయ నాయకులంటే ఖచ్చితంగా తెలుపు రంగు దుస్తులే ధరించాలనే నియమం అయితే ఎక్కడా లేదు. ఈ మధ్య కాలంలో నాయకులు తమ కార్ల ఎంపికలో సైతం నేతలు తెలుపుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ఎక్కువ మందికి తెలుపు అంటే స్టేటస్ సింబల్ అని మాత్రమే తెలుసు. కొంతమంది లీడర్లు అయితే అవతలి వారిని చూసి అనుసరించడమే తప్ప తెలుపు రంగు ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుందో తెలియకుండానే వాడేస్తూ ఉంటారు. ఇక తెలుపు వెనుక చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి, నిజాయితీకి ప్రతీక. స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో స్వదేశీ దుస్తువులు ఎక్కువగా తెలుపు రంగులో ఉండే ఖాదీ దుస్తులే అందుబాటులో ఉండేవి. అప్పట్లో తెలుపు రంగు ఖాదీ దుస్తువులను స్వరాజ్యానికి చిహ్నంగా భావించేవారు. దీంతో పాటు మహాత్మా గాంధీ సైతం అవే దుస్తులను ఉపయోగించడం తో నాయకత్వానికి సైతం ప్రతీకగా మారిపోయి తర్వాత తరం వారు కూడా అదే పంథాను కొనసాగించారు. కాలక్రమంలో ఇదే సంప్రదాయంగా మారిపోయింది. ఇక సౌకర్యం విషయానికి వస్తే ఖాదీ దుస్తులు ధరించడానికి ఎంతో సౌకర్య వంతంగా ఉండటం తో పాటు అన్ని కాలాలకు అనుగుణంగా ఉంటాయనేది మరి కొందరి భావన. ఇక తెలుపు రంగు దుస్తులపై ఇదే ప్రశ్నను కొందరు ఈ తరం రాజకీయ కవులకు అడిగితే తెలుపు రంగు అయితే సొంత పార్టీ రంగును వదిలించుకోవడానికైనా, మరో పార్టీ రంగు పూసుకోవడానికైనా సులభంగా ఉంటుందని చమత్కరిస్తూ ఉంటారు.

Advertisement

1 COMMENT

  1. తెల్ల బట్టలు వేస్కుంటేనే నాయకుడు అనుకుంటారు ప్రజలు మన దగ్గర …. అట్లా అయిపోయింది …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here