పరిపాలన మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయం

  • గౌలిదొడ్డి నూతన వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
వార్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో…

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం, ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో వార్డు కార్యాలయాల ఏర్పాటు అని అన్నారు.

వార్డు కార్యాలయం ప్రారంభం అనంతరం

వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందని అన్నారు. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారని తెలిపారు. వార్డు కార్యాలయంలో మొత్తం పదిమంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తుంది. రోడ్డు నిర్వహణ, పారిశుధ్యము, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పదిమంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. వీరితోపాటు భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరపున కూడా మరింత మంది అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులకు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ సభ్యులు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానులు, కాలనీ వాసులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here