నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల ఫ్లైఓవర్ పక్కన విద్యుత్ సరఫరా ప్రాంతం, వెర్టెక్స్ నిర్మాణ స్థలం వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నేనావత్ అనిల్ (26) డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. చందానగర్ ఝరాసంగం చిల్లేపల్లి తండాకు చెందిన అనిల్ నల్లగండ్ల ఫ్లైఓవర్ పక్కన విగతా జీవిగా పడిఉన్నాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి కుడి చేతి, ఎడమ పాదాలు విద్యుత్ షాక్ కు గురైనట్లు గుర్తించారు. అయితే మృతదేహం సమీపంలో కటింగ్ ప్లేయర్, కటింగ్ టూల్ కనిపించడం, ఆ వ్యక్తికి ఆ సైట్ కు సంబంధంలేదని, అక్కడ ఉండడానికి గల కారణం ఇంకా తెలియలేదని చందానగర్ పోలీసులు తెలిపారు.