నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ లోని దీనబంధు కాలనీలో గ్లోబల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడు ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ముత్యాలు ఆహ్వానం మేరకు స్థానిక నియోజకవర్గ ఇన్ చార్జి గజ్జల యోగానంద్, డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ పాల్గొని పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఏకాంత్ గౌడ్, భానుయాదవ్, అశోక్, గణేష్ గౌడ్, జితేందర్, మార్లశ్రీను, అరవింద్ యాదవ్, ముత్యాలు, భాస్కర్ పాల్గొన్నారు.