వైరస్ లను నాశనం చేసే మంత్రదండం “వైరస్ గార్డ్”

  • ఒక్కసారి స్ప్రే తో 90 రోజుల పాటు రక్షణ
  • బయో డీగ్రేడబుల్ క్రిమి సంహారక వినియోగం
  • మనుషులపై ప్రతికూల ప్రభావాలు ఉండవు
  • యుఎస్ లో ఈపీఏ, భారత్ లో ఈఎస్ సిఓ ఆమోదం

నమస్తే శేరిలింగంపల్లి: చూస్తుండ‌గానే ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి. ప్రపంచం అల్ల‌కల్లోలంగా మారిపోయింది. కోవిడ్-19 మ‌హ‌మ్మారి మాన‌వాళిని వదిలి వెళ్లే అవకాశాలు క‌నిపించడం లేదు. ఇదీ చాల‌ద‌న్న‌ట్టు ఇంకా కొత్త‌‌ కొత్త వైర‌స్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చేతుల్లో మంత్రదండం ఉండి, దాంతో మొత్తం వైరస్‌లన్నింటినీ నాశనం చేయగల్గితే ఎలా ఉంటుంది. వైర‌స్‌ను మ‌న ద‌రికి రాకుండా చేసే ప‌క్కా ప్లాన్ ఏదైనా ఉందా అంటే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏకైక మార్గం వైరస్ గార్డు అంటోంది ఈ పరికరం తయారీ సంస్థ. క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న అన్ని నివాస స‌ముదాయాల‌ను, వ్యాపార సంస్థ‌ల‌ను సురక్షితంగా మార్చడమే వైర‌స్ గార్డ్ ల‌క్ష్యం. ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రేయింగ్ సేవలను అందించ‌డానికి వైర‌స్ గార్డ్ ఇప్పుడు రంగంలోకి దిగింది.

ఈ పరికరాన్ని ఉపయోగించి ఇల్లు, ఆఫీసు, మ‌నం నివ‌సిస్తున్న అన్నీ ప్రాంతాల‌ను స్ప్రే చేసుకుని ఇన్ఫెక్షన్ రేటును తగ్గించుకోవచ్చు. స్ప్రే లో ఉపయోగించేది పేరుకు యాసిడ్ అయినా దాని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు తయారీదారులు. ఇది బ్లీచింగ్ పౌడర్ కంటే ఎంతో శక్తివంతంగా పనిచేసి వైరస్ మీద పోరాడుతుందని, ఏకంగా 90 రోజుల పాటు వైర‌స్‌లపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. వ్యాక్సిన్‌, మందులు లేని క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి ఈ వైర‌స్ గార్డ్ ఇప్పుడు ఏకైక మార్గ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఒక్క‌సారి మ‌నం ఈ ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రేయింగ్ చేయించుకుంటే ఏకంగా 90 రోజుల పాటు ర‌క్ష‌ణ‌గా ఉండే ఏకైక మార్గం ఇది. వైర‌స్ గార్డ్ అందిస్తోన్న ప్రభావవంతమైన స్పెక్ట్రం యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ రిటెన్టివ్ క్రిమిసంహారక. క్రియాశీల అణువుతో “ట్రై మిథాక్సీ సిలిల్ క్వాటర్నేరీ అమ్మోనీయం క్లోరైడ్” క్రిమిసంహారక మందుగా నిరూపించబడింది. అమెరికాలో లో ఈపీఏ, ఇండియాలో డీఎస్ సిఓ చే ఆమోదించబడింది.

ప్ర‌యోగ‌శాల‌లో నిపుణుల సార‌ధ్యంలో అత్యుత్త‌మంగా ప‌రీక్షించిన ఎలెక్ట్రోస్టాటిక్ స్ప్రేయింగ్ సుర‌క్షిత‌మైనదని. మ‌న‌కు ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండ‌వంటున్నారు తయారీ దారులు. ప‌ర్య‌వ‌ర‌ణానికి హాని చేయదని, ఎలాంటి వాస‌న లేని పూర్తిగా బయోడిగ్రేడబుల్ క్రిమిసంహారక కవరేజీని అందిస్తుంది. అత్యుత్తమ ఫలితాలను అందుకునే ఏకైక మార్గం ఇది అని చెబుతున్నారు.గేటెడ్ కమ్యూనిటీలు, వ్యక్తిగత గృహాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్టార్ హోటళ్ళు, ఐటి పార్కులు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, జిమ్‌లు ప్రభుత్వ కార్యాలయాలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, స్కూళ్లు, యూనివ‌ర్సిటీలు, ప్రజా రవాణా, ఆడిటోరియంలు, పరిశ్రమలు, వాహ‌నా‌లు.. ఇలా అన్నీ ప్రాంతాల్లో, అన్ని వ‌స్తువుల‌ను వైర‌స్ లేకుండా కాపాడుకునే మార్గం ఈ వైర‌స్ గార్డు అందిస్తుంది. ఈ పరికరం గురించిన మరిన్ని వివరాలకు 1800 1239 689 నెంబర్ లో సంప్రదించాలని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here