మంత్రి కేటీఆర్‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ వీడియో కాన్ఫ‌రెన్స్

– శేరిలింగంప‌ల్లిలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
– మంత్రి కేటీఆర్‌కు ప్ర‌జాప్ర‌తినిధుల విజ్ఞ‌ప్తి

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర మున్సిప‌ల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, కార్పొరేటర్లు, డివిజన్ తెరాస అధ్యక్షులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌నర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ కాన్ఫ‌రెన్స్‌లో వారు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు కాల‌నీల్లో ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు.

మంత్రి కేటీఆర్‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద ప్రజల సౌకర్యర్థం వారు నివసిస్తున్న ప్రాంతాలలో యాజమాన్య హక్కులు కల్పించే సొంత స్థలంలో నిర్మించుకున్న గృహాలకు యాజమాన్య హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చర్చించిన ప్రాధాన్యత అంశంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేయడం జరిగింద‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలలో సొంత ఇంటిలో ఉంటూ కూడా యాజమాన్య హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న ప్ర‌జ‌ల‌ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింద‌ని తెలిపారు. మంత్రి కేటీఆర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నియోజకవర్గంలోని కాలనీలను కవర్ చేస్తూ ఒక్కొక్క కాలనీలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింద‌న్నారు.

అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్, సర్వే నంబర్ 44 (బీకే ఎన్‌క్లేవ్ , రెడ్డి ఎన్‌క్లేవ్, మక్త, ప్రజ‌య్ షెల్టర్, నాగార్జున ఎన్‌క్లేవ్, జనప్రియ వెస్ట్ సిటీ, జన చైతన్య), సర్వే నంబర్ 100 (ప్రశాంత్ నగర్), సర్వే నంబర్ 101/ఎఎ లేపాక్షి సొసైటీ కాలనీ, దీప్తి శ్రీనగర్, మియాపూర్ గ్రామంలో 47 ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడంపై చ‌ర్చించారు. అలాగే జీవో నం.166, 59 లో చేసుకున్న దరఖాస్తులను జీవో నం.179 లో అనుమతించాల‌ని కోరారు. సర్వే నంబర్ 60, 71 నుండి 77 వరకు కొండాపూర్ గ్రామం రాఘవేంద్ర కాలనీలోని ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాల‌ని అన్నారు.

కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న కార్పొరేట‌ర్లు, తెరాస నాయ‌కులు, అధికారులు

సర్వే నంబర్ 366, 367 చందానగర్ విలేజ్ హుడా కాలనీ ఈడ‌బ్ల్యూఎస్‌ లో కేటాయించిన గృహ యజమానులు అదనపు స్థల లో నిర్మించిన కట్టడాలను రెగ్యులరైజ్ చేయాల‌ని, పాపిరెడ్డి నగర్ (కూకట్‌ప‌ల్లి) జీవో నం.59 లో రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒకే సర్వే నంబర్ లో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ విలువలలో వ్యత్యాసం ఉంద‌ని ఈ స‌మ‌స్యను ప‌రిష్క‌రించాల‌ని అన్నారు. సర్వే నంబర్ 358 లోని 3 బ్లాకులు ఎ బ్లాక్ కుత్బుల్లాపూర్ సర్కిల్ లో ఉండగా, బి, సి బ్లాకులు కూకట్‌ప‌ల్లి సర్కిల్ లో ఉన్నాయ‌ని, కానీ ఎ బ్లాక్ లో స్థ‌లం విలువ గజానికి రూ.6వేలు ఉంద‌ని, బి, సి బ్లాకులలో విలువ గజానికి రూ.15 వేల వ‌ర‌కు ఉంద‌ని, దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నార‌ని అన్నారు.

కూకట్‌ప‌ల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 లే అవుట్ ను అప్రూవ్ చేస్తూ బీఆర్ఎస్‌ / బీపీఎస్‌ దరఖాస్తులను ఆమోదించాల‌ని, కూకట్‌ప‌ల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, 2 లో నిర్మించిన 64 గృహాలను రెగ్యులరైజ్ చేయాల‌ని, కూకట్‌ప‌ల్లి ఆస్బెస్టాస్ కాలనీలో లే అవుట్ ను రివైజ్ చేసేందుకు అనుమతిస్తూ చేప‌ట్టిన నిర్మాణాలకు బీఆర్ఎస్‌ / బీపీఎస్ లో అవకాశం కల్పించాల‌ని కోరారు. అలాగే గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్, ఎన్టీఆర్‌ నగర్, సోఫా కాలనీ, తాజ్ నగర్, గోపన్ పల్లి తండా సర్వే నెంబర్ 124, సర్వే నంబర్ 66/2, 66/3 రాయదుర్గ పాన్ మక్త, శేరిలింగంపల్లి సురభి కాలనీ, వడ్డెర బస్తి, కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ ఎ , బి, సి బ్లాక్స్ , సర్వే నంబర్ 33 నుండి 39 వ‌ర‌కు రవీంద్ర సొసైటీ మాదాపూర్ యూఎల్సీ క్లియరెన్స్, సర్వే నంబర్ 2 నుండి 9 పల్లవి ఎన్‌క్లేవ్ గుట్టల బేగంపేట్, సర్వే నంబర్ 41/1 నుండి 41/13 ఖానామెట్ ఇజ్జ‌త్ నగర్, చందానగర్ – భవానీపురం వీక‌ర్ సెక్షన్ కాలనీ, భారతి నగర్ ఎంఐజీ బాంబే కాలనీ, మాదాపూర్ రాజరాం కాలనీ 214 సర్వే నెంబర్, హ‌ఫీజ్‌పేట్ సాయి నగర్ యూత్ కాలనీ -77 సర్వే నెంబర్, హ‌ఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 77 నుండి 80 వరకు నోటరీ ద్వారా ఖరీదు చేసిన ఆస్తులను క్రమబద్దీకరించాల‌ని కోరారు. కూకట్‌ప‌ల్లి పాపిరెడ్డి నగర్, ఆస్బెస్టాస్ కాలనీ , దీనబంధు కాలనీ , హనుమాన్ నగర్ వంటి పలు కాలనీల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

చరిత్రలో నిలిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా అనేక సంక్షేమ పథకాలతో అలరిస్తున్నారని అన్నారు. 30 సంవత్సరాల నుండి పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ప్రతి కాలనీ సమస్యలను వినతి పత్రం రూపంలో పూర్తి స్థాయి సమాచారంతో మంత్రి కేటీఆర్ కి సోమవారం అందజేయడం జరుగుతుందని, త్వరలోనే సమస్యలు పరిష్కరించబడ‌తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న కార్పొరేట‌ర్లు, తెరాస నాయ‌కులు, అధికారులు

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ‌లో భూ వివాదాల‌ను శాశ్వ‌తంగా ప‌రిష్కారించాల‌నే సంక‌ల్పంతో ప్ర‌భుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువచ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామ‌ని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేద‌ని, ఆస్తుల న‌మోదుకు సంబంధించి ద‌ళారుల‌ను న‌మ్మొద్ద‌ని, ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్ద‌ని కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల‌ని, సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ గ‌త ఆరేళ్ల‌లో దేశంలోని ల‌క్ష‌లాది మందికి ఆక‌ర్ష‌ణీయ‌ గ‌మ్య‌స్థానంగా మారింద‌ని కేటీఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, సాయి బాబా, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, జానకి రామ రాజు, లక్ష్మీ బాయి, నవతా రెడ్డి, పూజిత గౌడ్, సింధు ఆదర్శ్ రెడ్డి, వివేకానంద నగర్ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్,హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ అద్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హ‌ఫీజ్‌పేట్ డివిజన్ అధక్షుడు గౌతమ్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు నర్సింహా రావు, సీఎన్ రెడ్డి, సంజీవరెడ్డి, కేవీ రావు, సమ్మారెడ్డి త‌దిత‌రులు మంత్రితో మాట్లాడారు.

– ప్రభుత్వ‌ భూములలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న పేదలను జీవో 58 కింద ఆదుకోవాలి
– లిఖితపూర్వకంగా అభ్యర్దించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ లో ఉన్న వేముకుంట బస్తీ, కైలాష్ నగర్ బస్తీ, ఇందిరా నగర్ బస్తీ, పీఏ నగర్ బస్తీ, వేమన బస్తీ, భవానిపురం బస్తీ, జవహర్ కాలనీ బస్తీ, హరిజన బస్తీ, శివాజీ నగర్ బస్తీలలో ప్రభుత్వ‌ భూములలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో 58 కింద రెగ్యుల‌రైజ్ చేసి పేదలను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీల‌కు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కొన్ని బస్తీలలో ఇదివరకు కొన్ని పట్టాలు ఇవ్వటం జరిగింద‌ని, అందులో కొంతమందికి రాలేదని, మరి కొన్ని బస్తీలలో కొన్ని అనివార్య కార‌ణాల వల్ల‌ పట్టాలు ఇవ్వలేదని చాలా కాలంగా ఈ సమస్య వలన పేదలు ఇబ్బంది పడుతున్నార‌ని, జీవో 58 ద్వారా పేద ప్రజల ఇబ్బందులను తొలగించి వారిని ఆదుకోవాలని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మంత్రి కేటీఆర్‌ను వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కోరారు.

Advertisement

3 COMMENTS

  1. Hobble Gandhi garu
    As a member of Prasant nagar house owners welfare association in Sy no 100 I appreciate you to take effective steps on the issue of Prasanth nagar land. We request you to kindly lead our Association members and be with them till end of their meet With Honble Minister Sri KTR garu and we earnestly request you to kindly initiate steps to solve this 3 decades (30 yrs) long pending issue. Most of the plot owners in Prasanth nagar society are home less though they are having land. Even then it is well developed in all respects. No expected financial implication to Govt if it is solved by it. In fact this society is not involved in any litigation as it is having clear title with HUDA lay out approved by the then HUDA. There are no rival parties to this Prasanth nagar society land. By ones mistake it is unnecessarily put in trouble and we became victims for last 30 yrs. so it is very clear case that this society land is having very clear title and no rival claimants it may be very easy toGovt to help this Prasanth nagar to put full stop to this unended issue. We pray to kind enough to extend your help to lead our dedicated members to have successful meeting with Sri KTR garu. Kindly under stand the members anxiety for quick relief.

  2. Prashant Nagar HUDA approved layout residential plot owners 3 decades long victimisation and suffering is a classical case of justice delayed is justice denied.

  3. Sir, please look into the matter of Prashanth nagar.we have been victimised since 1992 for no reason. We purchased a plot in huda approved layout, we got permission to construction, got home loans from banks. What wrong we did we don’t know. We hail from lower middle class, by selling gold of our wife’s we purchased plot.. KTR GARU we need your support in this matter , it’s our life and death problem, we are not able to cinstruct a house though we have plot.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here