ఖాజాగూడలో ఘనంగా అయ్యప్ప స్వామి 18 కలశాల మహాపడి పూజా మహోత్సవం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఖాజాగూడ గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్‌లో శ్రీ అయ్యప్ప స్వామి వారి 18 కలశాల మహాపడి పూజా మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించి, 18 మెట్ల పడిపూజతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భజన మండలి సభ్యులు ఆలపించిన భక్తి గీతాలతో పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ మహోత్సవానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దగోని ధనంజయ గౌడ్, పెద్దగోని కాటం రాజ్ గౌడ్ (కన్నె స్వామి), రాజేష్ నంబూరి గురుస్వామి, రవి గురుస్వామి, ఆర్.కె. భజన మండలి సభ్యులు, అయ్యప్ప స్వాములు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here