శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): దీక్షా దివస్ సందర్భంగా శేరిలింగంపల్లిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేపట్టిన చారిత్రాత్మక నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

నాయకులు పొట్ట నరేందర్ యాదవ్, విజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన అలుపెరుగని పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ ఎంతో కీలకమైన ఘట్టమని, రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ నిరాహార దీక్ష గొప్ప మలుపుగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను స్మరించుకుంటూ, ఉద్యమానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్, కె.ఎన్. రాములు, సత్యనారాయణ యాదవ్, చిన్న ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, నర్సింహారెడ్డి, ఇబ్రహీం భాయ్, మల్లేష్ గౌడ్, సుభాష్ నాయక్, నిజాముద్దీన్, జమయ్య, హరీష్ యెనవరం, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.






