మియాపూర్‌లో కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం. గంగాధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు కేసీఆర్ దీక్ష ప్రతీకగా నిలిచిందని, ఆయన పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో ఎం. గంగాధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఆశ్రమంలో పండ్ల పంపిణీ, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here