శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా దీక్షా దివస్‌ను పురస్కరించుకుని హఫీజ్‌పేట డివిజన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను నాయకులు స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రామకృష్ణ గౌడ్‌తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు, గంగారం సంగారెడ్డి, ముద్దంగుల మల్లేష్, షేక్ సాబర్, సీతారాం, రమేష్, గోకారి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, కోటమర్తి రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.





