- అటెపల్లి లక్ష్మీ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందించిన కార్పొరేటర్లు
నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ పాఠశాలలో విద్యానభ్యసించే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించే దిశగా పయనించాలని కార్పొరేటర్లు అన్నారు. విద్యార్థుల కోసం అటెపల్లి లక్ష్మీ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. శేరిలింగంపల్లిలోని మియాపూర్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ట్రస్ట్ సభ్యులు పురుషోత్తం, రామప్రభు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ లు ప్రిన్సిపల్ ఉషారాణితో కలిసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ అందించిన సేవలను సద్వినియోగం చేసుకొని, కష్టపడి చదవాలని చెప్పారు.