నమస్తే శేరిలింగంపల్లి : శ్రావణమాసం సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధి గౌతమినగర్ లోని వేముకుంటలో శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో 300ల మంది మహిళలు పాల్గొని పూజలు చేశారు. పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి , గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాద్, ప్రధానకార్యదర్శి శివప్రసాద్, ఉపాధ్యక్షులు గాందీ చౌదరి, శ్రీకాంత్, నవీన్, ప్రముఖ కాంట్రాక్టర్ కట్ల యాదగిరి రెడ్డి, వారి కుటుంబసభ్యులు, పులిపాటి ధీరజ్, వారి కుటుంబసభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు ధనలక్మి, నిర్మల, సునీత, రామమోహనరావు, పద్మావతి పాల్గొని పూజలు చేశారు.
వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి తన సొంత ఖర్చులతో 1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.