- చందానగర్ క్రిస్టల్ గార్డెన్ లో ఒరిస్సా ఉత్కల్ మని గోపాబంద్ దాస్ నాల్గవ జయంతి
- అవార్డుల ప్రదానోత్సవం
- ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఒరిస్సా యూనియన్ మినిస్టర్ ప్రతాప్ చంద్ర సారంగి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ఒరిస్సా ఉత్కల్ మని గోపాబంద్ దాస్ నాల్గవ జయంతి సందర్భంగా చందానగర్ క్రిస్టల్ గార్డెన్ లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా యూనియన్ మినిస్టర్, పార్లమెంటు సభ్యులు ప్రతాప్ చంద్ర సారంగి తో కలిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉత్కల్ కమ్యూనిటీ సభ్యులకు నాల్గవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతాప్ చంద్ర సారంగితో ఈ కార్యక్రమంలో తనను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న ఒరిస్సా కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రాబోయే రోజుల్లో మీరంతా భారతీయ జనతా పార్టీని బలపరిచి గెలిపిస్తే తప్పకుండా మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఒరిస్సా కుటుంబ సభ్యులను కోరారు.