– పాలక మండలి సభ్యులుతో ప్రమాణ స్వీకారం చేయించిన ఈవో విజయ భారతి, కార్పొరేటర్ నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి( నమస్తే శేరిలింగంపల్లి) తారానగర్ తుల్జాభవాని అమ్మవారి దేవాలయంలో నూతన పాలకమండలి నియామకం అయింది. ఆలయ కమిటీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమకారుడు మల్లికార్జున శర్మ ను ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. సభ్యులుగా సంజీవ రెడ్డి, సంపత్, గోవింద చారి, రేణుక, రాజు తివారి, రవీందర్ ఎన్నికయ్యారు. కాగా ఆలయ ఈఓ విజయభారతి, ఇన్ స్పెక్టర్ మధు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు గురువారం నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ నూతన ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. 200 ఏళ్ల చరిత్ర గల తుల్జాభవాని అమ్మవారి ఆలయ నూతన భవన నిర్మాణం కోసం కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, రమేష్, వేణు గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు కవిత, రాంబాబు, నాయకులు నట్ రాజ్, గోపి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు లక్ష్మీ నారాయణ గౌడ్, రాంచందర్, మాజీ సభ్యులు బచ్చు రాజు నాగపురి మహేష్ యాదవ్ పాటు బండి ప్రసాద్, వెంకట్, మాల్ చంద్, బీజీపీ నియోజకవర్గ కన్వీనర్ బుచ్చిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.