దోపిడీ పాలకవర్గాలను తరిమేద్దాం

  • ఎంసిపిఐ(యు) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అశోక్ ఓంకార్

నమస్తే శేరిలింగంపల్లి :  అభివృద్ధి పేరుతో పాలకవర్గాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఎంసిపిఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ తెలిపారు. శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు లింగంపల్లి రైల్వే బ్రిడ్జి నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శేరిలింగంపల్లి కార్యాలయంలో ఎంసిపిఐయు అభ్యర్థి కామ్రేడ్ తుడుం అనిల్ కుమార్ నామినేషన్ దాఖల్ కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం మాట్లాడుతూ ఇన్నేండ్లలో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పేరుతో ఎంత అవినీతి పాలన జరిగిందో ప్రస్తుత బిఆర్ఎస్ పాలనలోనూ అంతే అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధానంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఐటి ఏరియా అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ భూములు రాష్ట్ర పరిపాలన ఖజానాకు వరంగా మారడం ఒక బాగం అయితే.. టిఆర్ఎస్ ప్రభుత్వ కను సన్నాళ్లలో రియల్ స్టేట్ బడ వ్యాపార సంస్థలు విదేశీ సంస్థలకు ప్రభుత్వ భూములు దారాదత్తం అయ్యాయని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం ప్రజల నివాసాల కోసం వినియోగించవలసిన భూములను, ఆస్తులను కొల్లగొట్టారని పేర్కొన్నారు.

గత కాంగ్రెస్, టిడిపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు అభివృద్ధి పేరుతో దోపిడి వర్గాలకు ప్రజల సొమ్మును దోచిపెట్టిందని, ప్రజలు ఇప్పటికైనా అభివృద్ధి పేరుతో ప్రజల ముందుకు వస్తున్న పాలకవర్గాల ధమన నీతిని, అవినీతి నెగట్టి ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలో రాష్ట్రంలో 50 కి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఇందులో ఎం సి పి ఐ యు 26 స్థానాలకు అభ్యర్థులను పోటీ చేస్తుందని ప్రజలు వారిని బలపరిచి చట్టసభలకు పంపి తమకులను సాధింప చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎం సి పి ఐ (యు) శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రజలను ఓట్లు అడగాలంటే ఒక్క ఎంసిపిఐయు పార్టీకి మాత్రమే హక్కు ఉందని, దోపిడీ అవకాశవాద రాజకీయ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. నియోజవర్గంలో 900 కోట్లతో అభివృద్ధి చేశామన్న బిఆర్ఎస్ అభ్యర్థి 70 వేల డబుల్ బెడ్ రూమ్ ల దరఖాస్తులుతో ప్రజలు ఇంకా విన్నపాలు చేసుకుంటుంటే ఎక్కడ అభివృద్ధి అయిందని ఆరోపించారు.

నీడలేక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వ భూములను రక్షించి ఇళ్ల స్థలాలు ఇస్తే అభివృద్ధి అవుత తప్ప రోడ్లు పార్కులు కట్టడాలు చేస్తే కాంట్రాక్ట్ సిస్టం పేరు తప్ప అభివృద్ధి కాదని, దీనికి బిఆర్ఎస్ నాయకులు ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. ఎం సి పి ఐ యు పార్టీ సామాజిక వర్గ ప్రజల శ్రేయస్ కోసం పని చేస్తుందని, నియోజకవర్గంలో గెలిస్తే ప్రభుత్వ భూములను రక్షించి ఇల్లు లేని నిరుపేదలకు భూములు పంచడమే మొదటి కార్యక్రమమని, అవినీతి అక్రమదారులకు తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజల పక్షా నుండి పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, వి. తుకారాం నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, తాండ్ర కళావతి, పి. భాగ్యమ్మ, పల్లె మురళి, అంగడి పుష్ప, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శివర్గ సభ్యులు ఇ.దశరథ్ నాయక్, ఎల్ రాజు, కర్ర దానయ్య, గ్రేటర్ సభ్యులు వై రాంబాబు, యన్ గణేష్, డి మధు విమల, డివిజన్ నాయకులు, జి. లలిత, గూడ లావణ్య, జి. శివాని, డి. నరసింహ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here