యలమంచి ఉదయ్ కిరణ్‌కి ప్రతిష్టాత్మక సేవా రత్న అవార్డు ప్రదానం

శేరిలింగంప‌ల్లి, మార్చి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రముఖ సామాజిక కార్యకర్త, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ కి ప్రతిష్టాత్మకమైన సేవా రత్న అవార్డును ప్రదానం చేశారు. గచ్చిబౌలిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన కమ్మ ఐకాన్ లెజెండరీ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమ్మ సంక్షేమ అభివృద్ధి సంస్థ డైరెక్ట‌ర్ ఏ.ఎస్.వి. రామారావు చౌదరి, బండారు మనోహర్ నాయుడు, అప్పసాని రాజేష్, ముప్పా అంకమ్మ రావు చౌదరి, కాకర్ల రంగనాథ్ హాజ‌రై యలమంచి ఉదయ్ కిరణ్ కి సేవా రత్న అవార్డును ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఈ గుర్తింపు నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేపడుతున్న ప్రతి సేవా కార్యక్రమం వెనుక మా వాలంటీర్లు, మద్దతుదారుల సమిష్టి కృషి ఉంది. ఈ అవార్డు మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలవడం నా ప్రధాన లక్ష్యం.. అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు నవ్యశ్రీ, లావణ్య, రాధాకృష్ణ, రమేష్, వంశీ, ప్రవీణ్, రాజేష్ చౌదరి, నాగసాయి, సాయి నిఖిల్, రాజేష్, సతీష్, వినోద్, నాని, వినయ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here