- పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
- కండువా కప్పి సాదరంగా ఆహ్వానం
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునానరు. హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురికి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలే పార్టీ శ్రీ రామ రక్ష అని తెలిపారు. యువత బీఆర్ఎస్ వైపే ఉందని, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంను ఎంతగానో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలకు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ముఖ్య నాయకులు దశరథ్, లత, కళ్యాణ్ కుమార్, దివ్య, సునీత, లక్ష్మీ, వెంకటేష్, శివ, అనిత, ఉపేందర్, కార్తిక్ ఉన్నారు.
- గంగారాం, సుభాష్ నగర్, హుడా కాలనీ నుంచి
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారాం, హుడా కాలనీ, సుభాష్ నగర్ కాలనీలకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ లో చేరారు. హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన పలువురికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీ ఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు మరియు వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు
బీఆర్ఎస్ లో చేరిన వారిలో..
ముఖ్య నాయకులు జీవన్, ధను, సంతోష్ , శేఖర్, మల్లేష్, సాయి కుమార్, కమల్, జాన్సన్, ఉమ సాయి, నవీన్, భాస్కర్, కిరణ్, సంతు, ప్రశాంత్, సురేష్, సునీల్, దుర్గ రావు, నరేష్, హరిప్రసాద్, శ్రీనివాస్ ఉన్నారు.