ఫీజు క‌ట్ట‌లేద‌ని విద్యార్థుల‌కు హాల్ టిక్కెట్లు ఇవ్వ‌క‌పోతే ఊరుకోం: ఏఐఎస్ఎఫ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఫీజులు చెల్లించ‌లేద‌ని విద్యార్థుల‌కు హాల్ టిక్కెట్లు ఇవ్వ‌కుండా ఒత్తిడికి గురి చేస్తే స‌హించేది లేద‌ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయ‌కులు హెచ్చ‌రించారు. శేరిలింగంప‌ల్లిలోని ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజులు క‌ట్ట‌ని విద్యార్థుల‌కు హాల్ టిక్కెట్లు ఇవ్వ‌కుండా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. ఏ విద్యార్థికైనా స‌రే ఫీజు చెల్లింపు, హాల్ టిక్కెట్ ఇవ్వ‌కుండా ఒత్తిడికి గురి చేయ‌డం వంటి స‌మ‌స్య‌లు ఎదురైతే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ ముందుండి హాల్ టిక్కెట్ల‌ను ఇప్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే ముందస్తు అడ్మిష‌న్ల పేరిట ప్రైవేటు పాఠ‌శాల‌లు పాల్ప‌డుతున్న దోపిడీని అరిక‌ట్టాల‌ని విద్యాశాఖ అధికారుల‌ను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల‌ అధ్యక్షుడు టి.నితీష్, కార్యదర్శి జె.ధర్మతేజ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here