- శివాజీనగర్ లో నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణ, శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని కోరుతూ శివాజీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగిని కృష్ణ, ద్యానబోయిన శ్రీకాంత్ ముదిరాజ్ తదితర సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు.
పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రచారంలో ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నదని, పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అంచెలంచెలుగా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.