టిఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదుతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగ‌స్వాములమ‌వుదాం: కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు టిఆర్ఎస్ పార్టీ స‌భ్య‌త్వం తీసుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ అన్నారు. మంగ‌ళ‌వారం శేరిలింగంపల్లి పరిధిలో గల తారనగర్ లో ఏర్పాటు చేసిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజ‌రై పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌భ్య‌త్వ న‌మోదు చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు టిఆర్ఎస్ ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌తీ ఒక్క‌రూ పార్టీ స‌భ్య‌త్వాన్ని తీసుకుని ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, తారనగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, వార్డు స‌భ్యులు కవిత గోపి, సీనియర్ నాయకులు హాబీబ్ భాయ్, రామచందర్, పాండు ముదిరాజ్, వెంకటేష్ , చిన్న, పవన్, రహీం, నర్సింగ్, విజయ్, నాగరాజు, జ్యోతి, కవిత, సునీత, గోపాల్ యాదవ్, కొయ్యడా లక్ష్మణ్ యాదవ్ త‌దితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here