నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామచంద్రారావు భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని రంగారెడ్డి జిల్లా (అర్బన్) ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రామచంద్రారావు సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయనను కలిసిన గోవర్ధన్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌గౌడ్ మాట్లాడుతూ స్వరాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను ఈరోజు నిరుద్యోగులుగా మార్చిన ఘనత కెసిఆర్ దని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో విద్యార్థులు, ఉద్యోగులు టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి-106 డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, యువమోర్చా నాయకులు అందెల కుమార్ యాదవ్, పవన్, విక్కీ, గణేష్ తదితరులు పాల్గోన్నారు.
