
నమస్తే శేరిలింగంపల్లి: ననూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జిహెచ్ఎంసి మేయర, డిప్యూటీ మేయర్లను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్, హఫీజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్‌రావుతో పాటు టిఆర్ఎస్ రాష్ర్ట సెక్రటరీ జనరల్ కోమాండ్ల శ్రీనివాస్‌రెడ్డిలు మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత రెడ్డిలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
