మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపును ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను
మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు అబ్దులు రహమాన్ ఎమ్మెల్యే గాంధీకి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసిన కార్యకర్తలు నాయకులందరికి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెరాస నాయకులు అబ్దుల్ రహమాన్, రాములు యాదవ్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు .
ఆల్విన్ కాలనీ: ఆల్విన్ కాలనీ డివిజన్ కు చెందిన టిఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజుల దాదాపు 100 మంది ఎమ్మెల్సీ దరఖాస్తు దారుల వివరాలను ప్రభుత్వ విప్ గాంధీకి అందజేశారు. పార్టీ అభివృద్ధి కోసం మంజుల కృషి ని గాంధీ అభినందించారు.