గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేయూకోవలని గచ్చిబౌలి డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట సురేష్ అన్నారు. బుధవారం గౌలిదొడ్డి స్టేట్ బ్యాంక్ వద్ద చిరు వ్యాపారాలు నిర్వహించే మహిళకు ఆత్మ నిర్బర్ భారత్ పథకం క్రింద లోను దరఖాస్తులు చేయడంలో మట్ట సురేష్ సహకారం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలపై అర్హులైన వారికి అవగాహన కల్పించడంలో చదువుకున్న వారు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.