నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం(టీపీయుఎస్ఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా శేరిలింగంపల్లికి చెందిన చిట్టా రెడ్డిప్రసాద్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునుకుంట్ల రాజేష్ రెడ్డి నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా చిట్టా రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి గ్రేటర్ భాద్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రెడ్డికి ప్రత్యేకంగ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నెలకొల్పబడిన ప్రైవేటు సంస్థలు మరియు పరిశ్రమలలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించడం, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారిని సంఘటితం చేసి ఏకతాటి పైకి తేవడం, కనీస వేతనం రూ 18 వేలకు తగ్గకుండా చూడటం, ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం అందేలా చూడటం, ఉద్యోగ భద్రతతోపాటు గౌరవ మర్యాదలు కాపాడమే లక్షంగా ముందుకుసాగుతానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శ్రమదోపిడి, ఇతర సమస్యలపై పోరాటం చేస్తానని హామి ఇచ్చారు.
