గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో గురువారం స్థానిక కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అండర్ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు, సిసి రోడ్లు ఇతర మౌలిక వసతుల ఏర్పాటు అంశాలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పాటు ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. సమస్యలపై స్పందించిన గంగాధర్ రెడ్డి వెంటనే డ్రైనేజీ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జిహెచ్ఎంసి అధికారులు రామ్ దాస్, కిష్టయ్య లతో పాటు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.