నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింతగా మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలను చేపడుతూ స్వచ్ఛ శేరిలింగంపల్లి గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా మంజూరైన చెత్త సేకరణ వాహనాలను గాంధీ, జోనల్ కమీషనర్ రవికిరణ్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపుడి గాంధీ మాట్లాడుతూ 13 మంది లబ్దిదారులకు చెత్త సేకరణ వాహనాలను అందజేశామని, ఫలితంగా కాలనీలలో చెత్త తొలగింపుతో పాటు లబ్దిదారులకు జీవనోపాది లభించిందని తెలిపారు. కాలనీలను స్వచ్ఛంగా ఉంచేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతీ ఒక్కరూ ఇండ్లలో పేరుకుపోయే చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త సేకరణ వాహనాలలో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఉప కమీషనర్ వెంకన్న, వైద్యాధికారి రంజిత్, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధరరెడ్డి, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్,నాయి నేని చంద్రకాంత్ రావు, కంది జ్ఞానేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

జెండా ఊపి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తున్న ఆరెకపూడి గాంధీ





