శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లిలో బోనాల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గోపన్‌పల్లిలోని ఈదమ్మ ఆలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించిన సాయిబాబా.. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో రాగం జంగయ్య యాదవ్, హరిశంకర్, నరసింహ, రాము, రాజు, రమేష్, నరేష్, శ్రీకాంత్ తదితరులతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






