శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్, రాయదుర్గం దర్గా గ్రామం, సాయినగర్ కాలనీలలో ఆషాఢమాస బోనాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు రథయాత్రలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని రవికుమార్ యాదవ్ ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల వేడుకలు, ఫలహారం బండి ఊరేగింపు రథయాత్రలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, నరేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.






