శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): దుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ఆగస్టు 8న సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. లేక్ పీసీ శ్రీశైలం పోలీసులకు సమాచారం అందించడంతో బ్లూ కోల్ట్స్ సిబ్బంది, సబ్ఇన్స్పెక్టర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. హైడ్రా సిబ్బంది సహాయంతో చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలి వయస్సు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా. ఆమె ఎరుపు రంగు లెగింగ్స్, తెలుపు చుక్కలతో కూడిన నీలి రంగు టాప్ ధరించి ఉంది. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ 8712663109, SHO కే.వి. సుబ్బారావు 8712663100, ఎస్సై సీహెచ్. సంతోష్ కుమార్ 8712554121 లను సంప్రదించవచ్చని సూచించారు.






