శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్లోని మక్తా మహబూబ్ పేటలో నివాసం ఉంటున్న పి.యాదమ్మ గత 15 రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా యాదమ్మకు మతి స్థిమితం సరిగ్గా లేదని, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి చిరునామా తెలియక ఇబ్బంది పడుతుంటుందని, అందువల్ల ఆమె గురించి సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఆమె ఆచూకీ తెలిస్తే 8978354896 అనే నంబర్లో సమాచారం అందించాలని తెలిపారు.






