నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్‌ను స్థానిక కార్పొరేటర్లు రెడ్డి మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో వారు మొక్కలు నాటారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ పార్క్ లో చిన్న పిల్లలకు అడుకునేందుకు వీలుగా కాలనీ అసోసియేషన్ సభ్యులు, దాతల సహకారంతో రకరకాల ఆట వస్తువులతో చిల్డ్రన్స్ పార్క్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ లాంటి గ్యాడ్జెట్లకు అలవాటు పడి పిల్లలు అటు శారీరక, ఇటు మానసిక ఎదుగుదలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్డ్రెన్స్ పార్కుల వైపు చిన్నారులను ఆకర్షితులను చేసి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉంచాలని తల్లితండ్రులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు పూర్ణచందర్ రావు, సీతారామయ్య, చంద్రశేఖర్ రావు, సుమన్ రెడ్డి, మంగపతి, ఓం ప్రకాష్ గౌడ్, మోహన్ రావు, శ్రీనివాస్, బాలకృష్ణ, వాసు, శ్రీనివాస్, మూర్తి, రాంబాబు, బబులు, రమణ, కోటి రామరాజు, శోభన్, శోభ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.