కాల‌నీ వాసులు స‌మిష్టిగా క‌మ్యూనిటీ హాలు నిర్మించుకోవ‌డం అభినంద‌నీయం: ఆరెక‌పూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్ పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని ఇంజ‌నీర్స్ ఎన్‌క్లేవ్‌లో కాల‌నీ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో కాల‌నీవాసుల స‌హ‌కారంతో నిర్మించిన క‌మ్యూనిటీ హాలును ప్ర‌భుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేట‌ర్లు జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌లతో క‌లిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ కాల‌నీవాసుల‌కు అందుబాటులో ఉండే విదంగా అన్ని స‌దుపాయాల‌తో నిర్మించుకోవడం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. కాలనీ అభివృద్ధి మరియు సమస్యల పై చర్చించుకోవడానికి చిన్న చిన్న సమావేశాలు , పొదుపు సమాఖ్య మహిళా ప్రతినిధులు సమావేశాలు, విందులు, వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌డానికి క‌మ్యూనిటీ హాలు ఎంతో అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అన్ని కాల‌నీలలో క‌మ్యూనిటీ హాళ్లు, పార్కులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. కాల‌నీలలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను త‌న దృష్టికి తీసుకువ‌స్తే వెంట‌నే ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని తెలిపారు. అనంత‌రం కాల‌నీలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింట‌న్ కోర్టును ప్రారంభించిన గాంధీ కొద్దిసేపు కాల‌నీవాసుల‌తో ఆడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు కరుణాకర్ గౌడ్, చంద్రకాంత్ రావు నాయి నేని, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్, కాలనీ ప్రెసిడెంట్ ఆంజనేయ రాజు, జనరల్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, సీతారామ ప్రసాద్, శివరామ కృష్ణ, బిఆర్‌సి రెడ్డి, వైవి రావు, రామాంజనేయులు , జెఎన్‌ రావు, ఆంజనేయులు, కాలనీ వాసులు, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు .

క‌మ్యూనిటీ హాలు ప్రారంభోత్స‌వంలో ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here