రోగికి శస్త్రచికిత్స.. 1000కి పైగా రాళ్ల తొలగింపు

  • దాదాపు 250 గ్రాముల రాళ్లను తొలగించిన డాక్టర్లు
  • 5గంటలు శ్రమించిన హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ సర్జన్ డాక్టర్ కిషోర్ రెడ్డి, అతని వైద్య బృందం
  • రోగి ప్రాణాలను కాపాడిన మెడికవర్ వైద్యులు
రోగి కాలేయం, పిత్తాశయం, పిత్త వాహిక నుంచి తొలగించబడిన రాళ్లు

నమస్తే శేరిలింగంపల్లి: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక రోగి మూడేండ్లుగా కడుపు నొప్పి, కామెర్లతో తరచుగా కోల్‌కతాలోని దవాఖానకు వెళ్తువున్నాడు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు అతని బహుళ పిత్తాశయం, పిత్త వాహికలో వేరుశెనగ పరిమాణం నుంచి నిమ్మకాయ వరకు వివిధ పరిమాణంలో రాళ్లు ఉన్నాయని తెలిపారు. వీటివల్ల కోలాంగిటిస్ (పిత్త వాహిక వ్యవస్థ వాపు) అభివృద్ధి చెందడం వల్ల అక్కడ డాక్టర్లు ఎండోస్కోపిక్ క్లియరెన్స్‌కు రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో రోగి మెడికవర్ హాస్పిటల్స్ లోని డాక్టర్ కిషోర్ రెడ్డి- కన్సల్టెంట్ – లివర్ ట్రాన్స్‌ప్లాంట్ & హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ (HPB) సర్జన్ గురించి తెలుసుకుని ఆయనను సంప్రదించాడు. ఎండోస్కోపిక్ క్లియరెన్స్ కోసం గతంలో చేసిన ప్రయత్నం విఫలం కావడం వల్ల డాక్టర్ కిషోర్ రెడ్డి, అతని బృందం శస్త్రచికిత్స చేసి దాదాపు 250 గ్రాముల రాళ్లను (1000 కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న రాళ్లను ) కాలేయం నుంచి ప్రాక్సిమల్ నాళాల నుంచి పిత్త వాహిక ద్వారా తొలగించారు. ప్రధాన పిత్త వాహికను పేగుతో కలిపారు. సుమారుగా 5 గంటలు శ్రమించి (హెపాటికోజెజునోస్టోమీ) శస్త్రచికిత్స ను విజయవంతం చేశారు. ప్రస్తుతం రోగికి ఎలాంటి సమస్యలు లేవని, ఐదు రోజుల సర్జరీ అనంతరం డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
రోగి, అతని కుటుంబ సభ్యులు డాక్టర్ కిషోర్ రెడ్డి, అతని బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ సర్జన్ డాక్టర్ కిషోర్ రెడ్డి

డాక్టర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా కాలేయం ద్వారా విసర్జించే కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి పిత్తంలో తగినంత రసాయనాలు ఉంటాయని, కానీ కాలేయం పిత్తం కరిగిపోయే దానికంటే ఎక్కువ కొలెస్ట్రాల్‌ను విసర్జిస్తే, అదనపు కొలెస్ట్రాల్ స్ఫటికాలుగా మారి చివరికి రాళ్లుగా ఏర్పడుతాయని తెలిపారు. ఆ సమయంలో మీకు తెలిసినప్పుడు వైద్యున్ని సంప్రదించాలని, లేకపోతే వాపు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here