సుప్రీంకోర్టు న్యాయవాది జీఎన్ రాజుపై చర్యలు చేపట్టండి : దొంతి శేఖర్ ముదిరాజ్

  • జగదీశ్వర్ గౌడ్ పై తప్పుడు సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేశారని ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి : సుప్రీంకోర్టు న్యాయవాది జిఎన్ రాజుపై శేరిలింగంపల్లి చందానగర్ పీస్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్, చందానగర్ సర్కిల్ జిహెచ్ఎంసి కమిషనర్, శేరిలింగంపల్లి మండలం తాసిల్దార్లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి శేఖర్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు.

గంగారం పెద్ద చెరువు ఎఫ్ టిఎల్ కు సంబంధించిన భూమిలో లాయర్ జీఎన్ రాజు ఏర్పాటు చేసిన బోర్డు

అతనిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పేరుతో గంగారం పెద్ద చెరువు ఎఫ్ టిఎల్ కు సంబంధించిన భూమిలో జియన్ రాజు బోర్డు పెట్టారన్నారు. తప్పుడు సమాచారంతో బోర్డు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యాలు ఎవరూ తలపెట్టని వదిలిపెట్టమని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here