- కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఉగాది పర్వదినాన ప్రజలు అందరూ సుఖ శాంతుల తో గడపాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర 2024-25 తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఆస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, అనిల్, రాజు ముదిరాజు, శ్రీశైలం, వినోద్, మల్లేష్, భక్తులు పాల్గొన్నారు.