తైక్వాండోలో గోల్డ్.. శ్రీజిత్

  • తైక్వాండో ఛాంపియన్‌షిప్ 2022లో ప్రతిభ..వెల్లువెత్తిన అభినందనలు

నమస్తే శేరిలింగంపల్లి: BHEL టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్‌లో సంగారెడ్డి జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్ 2022 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నగరం నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్దఎత్తున తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన మిస్టర్ తెలంగాణ స్టీల్‌మ్యాన్, బాడీబిల్డర్, వ్యక్తిగత శిక్షకుడు ద్యానబోయిన శ్రీకాంత్ ముదిరాజ్ కుమారుడు శ్రీజిత్ ముదిరాజ్ సత్తా చాటాడు. బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీజిత్ కు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.

శ్రీజిత్ కు గోల్డ్ మెడల్ అందిస్తున్న నిర్వాహకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here