గాంధీ విగ్రహం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…

  • చందానగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ లోని గాంధీ విగ్రహం తొలగించడంపై ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లిలోని ఆర్యవైశ్య సంఘాలు పాల్గొని నేషనల్ హైవే పై అధికారులు, ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి గాంధీ విగ్రహం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గాంధీ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయించాలని వినతి పత్రం అందించారు.

గాంధీ విగ్రహం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా

ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా మాట్లాడుతూ చందానగర్ డివిజన్ వంద కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ రావడం మంచిదని కాని అభివృద్ధి పేరుతో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న గాంధీ విగ్రహాన్ని తోలగించడం అత్యంత బాధకరం అన్నారు. చందానగర్ లో రాజికియ పార్టీలకు కులాలకు అతితంగా చందానగర్ డివిజన్ లోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి వర్థంతి వేడుకలు జరుపుకునే వాళ్లం అని అలాంటిది నేషనల్ హైవే అధికారులు ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ స్థానికులకు స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ చందానగర్ వాసులకు ఎటువంటి సమాచారం లేకుండా గాంధీ విగ్రహం తోలగించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ మరియు నేషనల్ హైవే అధికారులపై ప్రభుత్వ అధికారులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గార్లు చోరవ తిసుకోని గాంధీ విగ్రహాన్ని మరో చోట ఏర్పాటు చేయాలని కోరారు..లేనియేడల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా మల్లేష్ గుప్తా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన చేపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here