సోమేశ్వర ఆలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల విలేజ్ లోని సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వామివారిని దర్శించుకొని అర్చనలు చేయించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సోమేశ్వరాలయంలో అభిషేకం చేస్తున్న కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

ఈ కార్యక్రమం మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్నంరాజు, రవీందర్, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, రాజు, భాస్కర్, ఆలయ కమిటీ మెంబర్స్, భక్తులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కార్పొరేటర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here