ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని, గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బలరామ్, ఈశ్వర్, ప్రసాద్, రాజు,  శ్రీను, స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, భక్తులు, బస్తి వాసులు , కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సోమేశ్వరాలయంలో స్వామివారికి అభిషేకం చేస్తున్న కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి

సోమేశ్వర స్వామి ఆలయంలో..

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల విలేజ్ లోని సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని అర్చనలు చేయించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విట్టల్, ఆలయ చైర్మన్ కావలి చిన్నం రాజు ముదిరాజ్, కమిటీ సభ్యులు వసంత్ కుమార్ యాదవ్, మైలారం నరేందర్ గౌడ్, ఆకుల యాదగిరి, ముత్యాల రవీందర్, పెన్నేటి రమేష్, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, గిరి, నరేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, శంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు స్థానిక నేతలు, భక్తులు, బస్తి వాసులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here